కార్మికవర్గ రాజకీయాలు । सर्बाहरा राजनीती http://stalin-mao.net.in Voice of Proletarian Revolutionaries posterous.com Fri, 09 Mar 2012 23:23:00 -0800 రాళ్ళూ, రప్పలూ, సిమెంట్ బొమ్మల కోసం హింస అవసరమా? http://stalin-mao.net.in/97285918 http://stalin-mao.net.in/97285918

టైమ్ స్టాంప్ మార్చ్ 10 అని ఎందుకు వేశానంటే మార్చ్ 10వ తేదీకి ట్యాంక్ బండ్ విగ్రహాలు కూల్చి ఏడాది అవుతుంది కాబట్టి.

విగ్రహాలు కూల్చినంతమాత్రాన తెలంగాణా రాదు. అలాగే విగ్రహాలు కూల్చినవాళ్ళ మీద పడి ఏడవడం కూడా నిజాయితీపరుల లక్షణమని నేను అనుకోను. విగ్రహాలు కూల్చేవాళ్ళు మూర్ఖులైతే విగ్రహాలు కూల్చడం వల్ల తమ సంస్కృతి ద్వంసం అయిపోయిందని గగ్గోలు పెట్టేవాళ్ళు మహామూర్ఖులు.

నేను ట్యాంక్ బండ్ విగ్రహాల కూల్చివేతని సమర్థించినా ఆ కూల్చివేత వల్ల తెలంగాణావాదులకి పెద్ద లాభం రాలేదనే నమ్ముతాను, సమైక్యవాదులకి కూడా పెద్ద నష్టం రాలేదని నమ్ముతాను. విగ్రహాలు కూల్చడం వల్ల పోయేవి సిమెంట్, రాళ్ళూ, రంగులూ తప్ప సంస్కృతో, సజీవరూపాలో పోవని నేను ఇప్పటికీ నమ్ముతాను.

ఈ లింక్‌లు చదవండి, విషయం అర్థమవుతుంది:

http://venuvu.blogspot.in/2011/03/blog-post.html

http://venuvu.blogspot.in/2012/01/blog-post_31.html

చిహ్నాల ద్వంసం వల్ల ఆ చిహ్నాన్ని ఉపయోగించుకున్న సంస్కృతి పోదు అని అంటారు. నిజమే. చిహ్నాల ద్వంసం వల్ల ఏ సంస్కృతీ పోదు. మంగళ సూత్రం అనేది వైవాహిక సంబంధంలో పురుషాధిక్యతకి చిహ్నం. కానీ పెళ్ళైన స్త్రీలు మంగళ సూత్రాలు తీసేసినంతమాత్రాన పురుషాధిక్యత పోదు. అలాగని ఆడవాళ్ళు మంగళసూత్రాలు తీసెయ్యాలనే స్త్రీవాదుల వాదనలో తప్పుందని అనగలమా? చిహ్నాలని త్యజించడం ఒక్కటే సాంస్కృతిక మార్పుకి దారి తీస్తుందని ఎవరూ అనలేదు. అలాగని చిహ్నాలని త్యజించడం కూడా తప్పు అని అనలేము కదా. స్త్రీవాదులమని చెప్పుకునేవాళ్ళు మంగళ సూత్రాలు తీసెయ్యకుండా "తీసేసినంతమాత్రాన స్త్రీ-పురుష సంబంధాలలో మార్పులు రావు" అని చెప్పుకుంటూ తిరిగితే మార్పు ఎన్నటికీ రాదు. మంగళ సూత్రాలని తీసెయ్యడం కేవలం మార్పులోని ఆరంభానికి సూచన కావాలి.

అలాగే విగ్రహాల ద్వంసం కూడా ఉద్యమంలో ఒక భాగంగా జరిగిందనుకోవచ్చు కానీ అదే ఉద్యమమని ఎవరూ అనలేదు కదా. కనుక ఇక్కడ విగ్రహాల ద్వంసం వల్ల కోస్తా ఆంధ్ర ప్రాంతీయతత్వాన్ని సూచించే సంస్కృతి పోదు అనే వాదన ఎందుకు?

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Sun, 19 Feb 2012 22:33:10 -0800 రైల్వేలు - ఉత్పాదక శ్రమ & అనుత్పాదక శ్రమ http://stalin-mao.net.in/103486928 http://stalin-mao.net.in/103486928 మనం ట్రైన్ టికెట్ ఎందుకు కొంటాము? రైల్వేలకి ట్రైన్‌లు నడపడానికి డబ్బులు ఉండాలి కాబట్టి. ట్రైన్ నడపడానికి డీజిల్ ఖర్చు అవుతుంది, పట్టాలు & చక్రాలు అరిగిపోతే, పెట్టెలు పాతవి అయిపోతే అవి మార్చడానికి ఇనిము ఖర్చు అవుతుంది. స్టేషన్ భవనాలు, ప్లాట్‌ఫార్మ్‌లు, పట్టాల కింది స్లీపర్లు, రైల్వే వంతెనలు పాతవి అయిపోతే వాటిని మార్చడానికి సిమెంట్ & ఇనుము రెండూ ఖర్చు అవుతాయి. రైల్వేలకి ఈ వనరులని ప్రొక్యూర్ చెయ్యాలంటే డబ్బులు కావాలి. పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ దేనికైనా డబ్బులు కట్టాలి. నిజానికి డబ్బు అనేది లేకపోతే, అంటే కమ్యూనిస్ట్ సమాజం ఏర్పడితే రైలు ప్రయాణం అనేది ఉచితం అవుతుంది. రైల్వేలలో లోకో డ్రైవర్ చేసేది ఉత్పాదక శ్రమ, ట్రైన్ గార్డ్ చేసేది కూడా ఉత్పాదక శ్రమ, స్టేషన్ మాస్టర్ చేసేది కూడా ఉత్పాదక శ్రమ. ఎందుకంటే ట్రైన్ కదలాలంటే లేదా ఆగాలంటే గార్డ్ లేదా స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇవ్వాలి. టికెట్ క్లర్క్ & టిటి‌ఇలు అనుత్పాదక కార్మికుల కిందకి వస్తారు. ప్రయాణించడం ప్రయాణికుని అవసరం, ప్రయాణికుడు టికెట్ కొనడం పెట్టుబడిదారీ వ్యవస్థలో రైల్వేల నిర్వాహకుల అవసరం, టికెట్ కొన్న ప్రయాణికుడు టిటి‌ఇకి టికెట్ చూపించడం కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలో రైల్వేల నిర్వాహకుల అవసరమే. పెట్టుబడి అనేది లేకపోతే రైల్వేల నిర్వాహణకి డబ్బులు తీసుకోవలసిన అవసరం అనేది ఉండదు కనుక టికెట్ క్లర్క్ & టిటి‌ఇలు అనుత్పాదక కార్మికులే అవుతారు. రంగనాయకమ్మ గారు ఈ ఉదాహరణ కోసం బస్సు, బస్సు డ్రైవర్, క్లీనర్, కండక్టర్ & బస్సు పెట్టుబడిదారుడిని పాత్రలుగా చూపించారు. అనుత్పాదక కార్మికులు రోడ్ రవాణా, రైల్వేలలోనే కాదు, అన్ని చోట్లా ఉన్నారు. ఇక్కడ వ్రాసినవి ఉదాహరణలు మాత్రమే.

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Sun, 19 Feb 2012 18:44:42 -0800 కేపిటల్ వాల్యూమ్ I - మారకపు వస్తువులు & ద్రవ్యం http://stalin-mao.net.in/i http://stalin-mao.net.in/i పెట్టుబడి వృద్ధి చెందకముందు సంతలలో వస్తువులు మార్చుకునే విధానం ఉండేది. సంతలో గోధుమలు మార్చుకుని జొన్నలు కొనొచ్చు కానీ జొన్నలు మార్చుకుని ఇనుముని కొనాలంటే ఈ రెండు మారకపు వస్తువుల యొక్క క్వాంటిటీ (పరిమాణం)లో తేడా వస్తుంది. సంతలో మారకంపై యూజ్ వాల్యూ (వాడకపు విలువ) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సంతలో ఉత్పత్తిదారుడే డైరెక్ట్‌గా వస్తువుని అమ్ముతాడు కాబట్టి సంతలో వస్తువు యొక్క మారకపు విలువ ఉత్పత్తిదారుని శ్రమపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇనుముని కొలిమిలో కాల్చడానికి శ్రమ ఎక్కువే అవుతుంది కాబట్టి కొలిమిలో కాల్చిన ఇనుముని సంతలో అమ్మేవాడు దానికి ఎక్కువ ధరే పెడతాడు. జొన్నలు మార్చి ఇనుము కొనాలంటే ఈ రెండు మారకపు వస్తువుల యొక్క క్వాంటిటీలో తేడా తప్పకుండా ఉంటుంది. ద్రవ్య వ్యవస్థలో ఒక వ్యక్తి తయారు చేసిన వస్తువుని ఇంకో వ్యక్తి డబ్బులతో కొని కొన్న వ్యక్తి డబ్బుల కోసం ఆ వస్తువుని తిరిగి ఇంకో వ్యక్తికి అమ్ముతాడు. ఒకరు తయారు చేసిన వస్తువుని డబ్బులతో కొన్న వ్యక్తి దాన్ని మూడో వ్యక్తికి అదనపు డబ్బులకి అమ్మి లాభాలు మిగుల్చుకోగలడు. వస్తువుని తయారు చేసిన వ్యక్తికి శ్రమ ఎంత అయ్యిందో మూడో వ్యక్తికి తెలియదు. ఆ వస్తువుని కొని తనకి అమ్మిన వ్యక్తి ఆ వస్తువు యొక్క తయారీదారునికి ఎంత డబ్బులు ఇచ్చాడో కూడా మూడో వ్యక్తికి తెలియదు. ఇక్కడ డిమాండ్ & సేల్ ఆధారంగా ఆ మూడో వ్యక్తి వస్తువుని తీసుకొచ్చిన వ్యక్తికి డబ్బులు ఇచ్చాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. కార్మికుడు తన శ్రమని పెట్టుబడిదారునికి అమ్ముతాడు. కార్మికుని శ్రమని కొన్న పెట్టుబడిదారుడు దాన్ని ఉపయోగించుకుని ఎన్నో రెట్లు లాభాలు సంపాదిస్తాడు.


కాపిటల్ వాల్యూమ్ I చదవండి:
http://www.marxists.org/archive/marx/works/1867-c1/
ఒకవేళ అర్థం కాకపోతే సందేహాలకి సమాధానం చెపుతాను. నా ఈ-మెయిల్ అడ్రెస్ praveen[at]stalin-mao.net.in

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Fri, 17 Feb 2012 16:36:36 -0800 లోక్‌సత్తా సూత్రీకరణలు ప్రాక్టికల్‌గా సాధ్యమేనా? http://stalin-mao.net.in/102878433 http://stalin-mao.net.in/102878433 గతంలో నేను మార్క్సిజాన్ని వ్యతిరేకించే రావిపూడి వెంకటాద్రి అనే ఆయన రచనలు చదివేవాణ్ణి. ఆయన ఐడియాలజీ కొంత వరకు లోక్‌సత్తా ఐడియాలజీలాగ, కొంత వరకు నెపోలియన్ బొనపార్ట్ స్టైల్‌లాగ ఉండేది. ఆయన అభిప్రాయం ప్రకారం సోషలిస్ట్ విప్లవం అవసరం లేదట, అధికార వికేంద్రీకరణ చేసి స్థానిక సంస్థలకి అధికారాలు పెంచితే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయట! స్థానిక సంస్థలు కూడా అధికార దుర్వినియోగం చెయ్యగలవు. గ్రామ పంచాయితీ నిధులని సర్పంచ్‌లు భోంచెయ్యడం గురించి పేపర్‌లలో ఎన్నడూ చదవనట్టు మాట్లాడితే ఏదీ రాదు. వర్గ పోరాటాల గురించి రావిపూడి గారు చెప్పేది ఏమిటంటే 'ఆయన దృష్టిలో అన్ని వర్గాలూ సమానమేనని'. నెపోలియన్ బొనపార్ట్ కూడా తన దృష్టిలో అన్ని వర్గాలూ సమానమేనని చెప్పుకున్నాడు. అతను అల్టిమేట్‌గా ఏ వర్గానికి అనుకూలంగా పని చేశాడో చరిత్ర చదివినవాళ్ళందరికీ తెలిసినదే. వర్గ పోరాటం అవసరం లేదని చెప్పేవాడు ఎవడైనా తన దృష్టిలో అన్ని వర్గాలూ సమానమనే అంటాడు.

ఇక్కడ రావిపూడి వెంకటాద్రి గారి ప్రస్థావన ఎందుకు తీసుకురావలసి వచ్చిందంటే జిల్లా ప్రభుత్వాల విషయంలో జెపి గారి థీసిస్ కూడా రావిపూడి గారి థీసిస్‌లాగే ఉంది. జిల్లా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే వర్ట్యువల్‌గా చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసినట్టే. తెలంగాణా, విదర్భ, సౌరాష్ట్ర లాంటి చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యడానికే మీనమేషాలు లెక్కబెట్టుకుంటున్న పాలకులు ప్రతి జిల్లాకీ ప్రత్యేక రాష్ట్రం తరహా హోదా ఇవ్వడానికి అంత సులభంగా ఒప్పుకుంటారంటే అది సందేహమే.

మన దేశంలో పాలకవర్గంవాళ్ళు అనుసరిస్తున్నవి సామ్రాజ్యవాదులకి అనుకూలమైన గ్లోబలైజేషన్ విధానాలు. ఈ విధానాలు అమలు జరగాలంటే దేశమంతా ఒకే రాజకీయ విధానం ఉండాలి. అది కేంద్రీకృత రాజకీయ విధానంలోనే సాధ్యమవుతుంది కానీ స్థానిక ప్రభుత్వాల వల్ల జరగదు. ఒక ప్రాంతంలో ఉన్న గనులని ఒక బహుళజాతి కంపెనీకి అమ్మెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుని తరువాత జిల్లా ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఏమవుతుంది? జిల్లా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే గ్లోబలైజేషన్ అమలులో ఇలాంటి సాంకేతిక సమస్యలు వస్తాయని తెలిసిన పాలక వర్గంవాళ్ళు ఆ ప్రభుత్వాలని ఏర్పాటు చెయ్యడానికి ఒప్పుకుంటారా? గ్లోబలైజేషన్ గురించి జెపి స్పష్టంగా ఏమీ చెప్పలేదు. లోక్‌సత్తా గ్లోబలైజేషన్‌ని సమర్థిస్తోందని ఒకడు, సమర్థించడం లేదని ఒకడు భాష్యం చెప్పగలడు. గ్లోబలైజేషన్‌ని వ్యతిరేకిస్తే ఎలైట్ క్లాస్‌వాళ్ళ సపోర్ట్ పోతుంది. గ్లోబలైజేషన్‌ని సమర్థిస్తే దిగువ తరగతివాళ్ళు వ్యతిరేకిస్తారు. రెండు వర్గాలకీ అభిప్రాయం కలపలేని కాంట్రోవర్సియల్ విషయాలలో స్పష్టంగా ఏమీ మాట్లాడకుండా ఉండడమే జెపి యొక్క మోడస్ ఓపరాండి.

లోక్‌సత్తా గురించి రంగనాయకమ్మ గారు వ్రాసిన వ్యాసం చదివాను. అవినీతి వ్యతిరేక పోరాటం అనేది కేవలం నీడతో యుద్ధమే అవుతుంది కానీ వ్యవస్థపై యుద్ధం మాత్రం అవ్వదు అని రంగనాయకమ్మ గారు అన్నారు. రంగనాయకమ్మ గారు చెప్పినది నిజమే కానీ ఆ వ్యాసం చదివినంతమాత్రాన లోక్‌సత్తా కార్యకర్తలు మారుతారని నేను అనుకోను. ఎందుకంటే లోక్‌సత్తా తన ఆర్థిక విధానాన్ని స్పష్టంగా ప్రకటించలేదు. లోక్‌సత్తా ఆర్థిక విధానం గురించి ఇద్దరు లోక్‌సత్తా కార్యకర్తలే ఒకదానికొకటి విరుద్ధమైన భాష్యం చెప్పగలరు. కాంట్రోవర్సీ అనిపించే విషయాల గురించి జెపి స్పష్టంగా మాట్లాడడు కనుక ఈ విషయంలో లోక్‌సత్తా నుంచి మార్పు వస్తుందని అనుకోలేము.

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Fri, 17 Feb 2012 02:39:23 -0800 సర్వ దరిద్రాలకీ సకల ఉపాయాలు http://stalin-mao.net.in/102696840 http://stalin-mao.net.in/102696840 జెంఘిస్ ఖాన్ పేరు మీరు వినే ఉంటారు. అతని సైనికులు ఒక దేశంపై దాడి చేసినప్పుడు ఆ దేశంలోని గ్రామాలపై దాడి చేసి, ధనధాన్యాలని కొల్లగొట్టి, అక్కడి స్త్రీలని రేప్‌లు కూడా చేసేవాళ్ళు.
శతృవులని ఓడించడానికి ఇలాంటి పనులు చెయ్యడం పాత స్టైల్. ఇప్పుడు లేటెస్ట్ స్టైల్ ఇంకొకటి ఉంది. ఆ లేటెస్ట్ స్టైల్‌లోనే పంజాబ్ పోలీసులు 1970లలో నక్సలైట్లని దెబ్బకొట్టడానికి ప్రయత్నించారు.

1970ల టైమ్‌లో పంజాబ్‌లో పోలీసులు నక్సలైట్ల వేషం వేసుకుని భూస్వాములనీ, మధ్య తరగతి రైతులనీ బెదిరించి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ఆ వసూళ్ళు నక్సలైట్లే చేశారని ప్రచారం చేసేవాళ్ళు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో CPM కార్యకర్తలు నక్సలైట్ల వేషం వేసుకుని దుకాణాలని కొల్లగొట్టి ఆ పని నక్సలైట్లే చేశారని ప్రచారం చేసేవాళ్ళు. మొదట్లో అన్ని పత్రికలవాళ్ళూ అవి నక్సలైట్లే చేశారని నమ్మేశాయి. కానీ నిజం తరువాత తెలిసింది. దేశంలో నక్సలైట్ ఉద్యమం బలహీనపడి ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే నక్సలైట్ ఉద్యమం మిగిలిన తరువాత కొందరు వామపక్ష రచయితలు వ్రాసిన పుస్తకాల ద్వారా ఈ నిజం తెలిసింది.

తెలుగు సినిమాలలో చూస్తుంటాము. ఆందోళన చేస్తున్న గుంపులోకి కొంత మంది గూండాలు చేరుతారు. వాళ్ళు గుంపు మధ్యలో ఉన్నవాళ్ళలాగ నటించి పోలీసుల మీదకి రాళ్ళు లేదా సీసాలు విసిరి పారిపోతారు. ఆందోళనకారులే రాళ్ళూ, సీసాలు విసిరారనుకుని పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు లేదా కాల్పులు జరుపుతారు. అది ఆందోళనకారులని నైతికంగా దెబ్బతీసే ఎత్తు. పంజాబ్‌లో పోలీసులు, పశ్చిమ బెంగాల్‌లో CPM కార్యకర్తలు ఇలాంటి చిల్లర టెక్నిక్‌లే ప్రయోగించి నక్సలైట్లని నైతికంగా దెబ్బతీసే ఎత్తులు వేశారు.

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Wed, 15 Feb 2012 09:55:49 -0800 యూటోపియన్ కమ్యూనిస్ట్‌కీ, విప్లవ కమ్యూనిస్ట్‌కీ మధ్య తేడా http://stalin-mao.net.in/102194512 http://stalin-mao.net.in/102194512 కమ్యూనిజంని కనిపెట్టినది మార్క్స్ కాదు, ఎంగెల్స్ కూడా కాదు. మార్క్స్, ఎంగెల్స్ కమ్యూనిస్ట్‌లుగా మారకముందే యూరోప్‌లో కమ్యూనిస్ట్ లీగ్ అనే సంస్థ ఏర్పడింది. అయితే ఆ సంస్థలో పని చేసినవాళ్ళందరూ యూటోపియన్ కమ్యూనిస్ట్‌లు & క్రైస్తవ కమ్యూనిస్ట్‌లు. యూటోపియన్ కమ్యూనిస్ట్‌లకి వర్గ పోరాట తత్వం తెలియదు. కమ్యూనిజం (ప్రైవేట్ ఆస్తి లేని సమాజం) ఒక దూరపు స్వప్నం అనీ, అది ఎప్పుడో వస్తుందనీ యూటోపియన్ కమ్యూనిస్ట్‌లు నమ్మేవాళ్ళు. మార్క్స్ & ఎంగెల్స్ కమ్యూనిజం అనేది వర్గ పోరాటం ద్వారానే వస్తుందని నమ్మేవాళ్ళు.

మార్క్స్ & ఎంగెల్స్ కూడా మొదట్లో తాము కమ్యూనిస్ట్‌లమని చెప్పుకోలేదు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మార్క్స్‌కీ, ధనిక కుటుంబంలో పుట్టిన ఎంగెల్స్‌కీ కమ్యూనిస్ట్‌లుగా మారడానికి కొంత సమయం పట్టింది. కమ్యూనిస్ట్‌లుగా మారకముందు వీళ్ళిద్దరూ తాము విప్లవ ప్రజాస్వామికవాదులమనే చెప్పుకున్నారు. ప్రైవేట్ ఆస్తిని రద్దు చెయ్యాలనే విషయంలో అందరు కమ్యూనిస్ట్‌ల లక్ష్యం ఒకటే. కానీ సామాజిక వైరుధ్యాలని పరిశీలించే విషయంలో, పోరాటతత్వంలో వాళ్ళ మధ్య తేడాలు ఉంటాయి.

యూటోపియన్ కమ్యూనిస్ట్‌లు కాకుండా యూటోపియన్ సోషలిస్ట్‌లు అనే వర్గంవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. రోబర్ట్ ఓవెన్ & సైంట్ సైమన్‌లు ఈ వర్గానికి చెందినవాళ్ళే. వీళ్ళు ధనవంతుల సహాయం వల్లే పేదవాళ్ళ జీవితాలు బాగుపడతాయని నమ్మేవాళ్ళు. వీళ్ళు తమ వ్యక్తిగత డబ్బులోని కొంత భాగాన్ని దాన ధర్మాలకి ఖర్చు పెట్టేవాళ్ళు. పేదవాళ్ళ సహాయం కోసం సహాయ నిధిని ఏర్పాటు చేసి ఆ సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని పెట్టుబడిదారులనీ, భూస్వాములనీ అడిగేవాళ్ళు. వీళ్ళు సంవత్సరాల తరబడి నిరీక్షించినా వీళ్ళ సహాయ నిధికి విరాళాలు ఇవ్వడానికి ఒక్క పెట్టుబడిదారుడు ముందుకి రావడం కూడా కష్టంగా ఉండేది. కార్ల్ మార్క్స్ తండ్రి హెన్రిక్ మార్క్స్‌కి పరిచయస్తులైనవాళ్ళలో ఈ యూటోపియన్ భావాలు గల వాళ్ళు కొందరు ఉండేవాళ్ళు. మార్క్స్ వీళ్ళ ద్వారా రోబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్ లాంటి యూటోపియన్ సోషలిస్ట్‌ల గురించి తెలుసుకున్నాడు. యూటోపియన్ సోషలిజం పెట్టుబడిదారులని కదల్చదు అని గ్రహించిన మార్క్స్ వర్గ పోరాటతత్వాన్నే సమర్థించాడు. వర్గ పోరాటతత్వాన్ని బలపరచడానికి మార్క్స్‌కి హెగెల్ తత్వశాస్త్రంలోని గతితార్కిక కోణం బాగా ఉపయోగపడింది.

రోబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్ లాంటి వాళ్ళు కార్మిక వర్గానికి చేసిన మేలు కూడా ఉంది. వీళ్ళ రచనల వల్ల కార్మిక వర్గంవాళ్ళు తమ హక్కులు ఏమిటో తాము తెలుసుకోగలిగారు. రోబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్‌లకి వర్గ పోరాటం గురించి ఏమీ తెలియకపోయినా కార్మిక వర్గ హక్కుల గురించి మాత్రం కార్మిక వర్గానికి చెప్పగలిగారు.  హెగెలియన్ గతితర్కం మాత్రమే కాదు, రోబర్ట్ ఓవెన్ & సైంట్ సైమన్‌ల వాదం కూడా మార్క్సిజం నిర్మాణానికి పునాదులు వేసింది.

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Tue, 14 Feb 2012 23:02:00 -0800 రైతుల ఆత్మహత్యలు http://stalin-mao.net.in/96887693 http://stalin-mao.net.in/96887693

ఈ డాక్యుమెంటరీ రూపొందించినది తెలంగాణాకి చెందిన వివేక్ అనే వ్యక్తి. ఈ వీడియోలోని దృశ్యాలు మహారాష్ట్రలో షూటింగ్ చెయ్యబడినవి.

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Sat, 11 Feb 2012 23:02:00 -0800 తెలంగాణా బతుకు పోరాటం http://stalin-mao.net.in/96883690 http://stalin-mao.net.in/96883690

Telangana_Brathuku_Poratam_illu_pailam_chudu_mayamma.mp4 Watch on Posterous

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Wed, 08 Feb 2012 21:02:00 -0800 తెలంగాణా పోరాటం http://stalin-mao.net.in/96704868 http://stalin-mao.net.in/96704868

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Sun, 29 Jan 2012 18:44:32 -0800 నాలుకతో దేవుని పేరు పలుకుతూ భుజం మడతలో కత్తి దాచుకునేవాడే మహాత్ముడు - అంబేద్కర్ http://stalin-mao.net.in/96853429 http://stalin-mao.net.in/96853429
5gandhiflyer.pdf Download this file

ఈ ఫ్లయర్ చదవండి, విషయం అర్థమవుతుంది:

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Sun, 29 Jan 2012 06:51:10 -0800 మన రాష్ట్రంలో ప్రభుత్వం అంటే ఏమిటో తెలియని గిరిజనులు ఉన్నారా? http://stalin-mao.net.in/96767519 http://stalin-mao.net.in/96767519 చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా ఒక వెనుకబడిన ప్రాంతం. కానీ ఆ ప్రాంతంలో ఇంద్రావతి నది ఉండడం వల్ల జనాభా సాంద్రత చదరపు కిలో మీటర్‌కి 140 మంది ప్రజలు ఉన్నట్టు చూపిస్తుంది. ఇది మన రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా జనాభా సాంద్రత కంటే ఎక్కువే. అయితే ఇంద్రావతి నది కంటే పెద్ద నది అయిన గోదావరి నది ఆదిలాబాద్ జిల్లాలో ప్రవహిస్తుంది కనుక వాస్తవానికి ఆదిలాబాద్ జిల్లా జనాభా సాంద్రత ఎక్కువ ఉండాలి. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని జనాభా సాంద్రతకి గోదావరి, ప్రాణహిత లాంటి నదులు మాత్రమే ఆధారం కాదు. ఆ జిల్లాలో బొగ్గు గనులు ఉన్న మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాలలోనూ, పేపర్ పరిశ్రమ ఉన్న సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతంలోనూ జనాభా సాంద్రత ఎక్కువగానే కనిపిస్తుంది.

బస్తర్ జిల్లా కూడా వెనుకబడిన జిల్లాయే అయినప్పటికీ టూరిస్ట్‌లు వచ్చిపోయే జగ్‌దల్‌పుర్, చిత్రకూట్ ప్రాంతాలలో జనాభా సాంద్రత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లెక్కలు పైపై లెక్కలే. లోతులు చూస్తే ఆశ్చర్యకరమైన నిజాలు తెలుస్తాయి.

మన రాష్ట్రంలో బస్తర్ జిల్లా కంటే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. బస్తర్ జిల్లాలో జిల్లా కేంద్రమైన జగ్‌దల్‌పుర్ పట్టణ సమీపంలో ఉన్న దర్భా ప్రాంతంలో 90% మంది పైగా గ్రామస్తులు మట్టితో నిర్మించిన ఇళ్ళలోనే నివసించడం కనిపిస్తుంది. అయితే దర్భా ప్రాంతంలోని గిరిజనులలో ప్రభుత్వం అంటే ఏమిటో తెలియనివాళ్ళు మాత్రం లేరు. ప్రభుత్వం అంటే ఏమిటో తెలియని గిరిజనులు మన రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఉన్నారు. విజయనగరం జిల్లాలో మెజారిటీ ప్రజలు OBC కులాలకి చెందినవాళ్ళు. కానీ ఆ జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలలో గిరిజన గ్రామాలు కనిపిస్తాయి. అలాగే దక్షిణాన ఉన్న శృంగవరపుకోట ప్రాంతంలో కూడా గిరిజన గ్రామాలు కనిపిస్తాయి. ఆ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని కొంత మంది గిరిజనులకి ప్రభుత్వం అంటే ఏమిటో తెలియదు. వారపు సంతలకి వచ్చి వ్యవసాయ ఉత్పత్తులూ, అటవీ ఉత్పత్తులూ అమ్ముకోవడం తెలుసు కానీ ప్రభుత్వం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. గిరిజన ప్రాంతాలకి దగ్గరలో పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు లాంటి పట్టణాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలలో పని చేసే ప్రభుత్వ అధికారులు ఆ పట్టణాలలో ఇళ్ళు అద్దెకి తీసుకుని ఆ పట్టణాల నుంచి గ్రామాలకి రోజూ అప్&డౌన్ అవుతుంటారు. పట్టణాలలో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు ఉంటాయి, అవి వాళ్ళ పిల్లల చదువులకి అనుకూలంగా ఉంటాయి కనుక వాళ్ళు అలా చేస్తారు. సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ప్రభుత్వం అంటే ఏమిటో తెలియని గిరిజనులు ఉన్నారంటే మనకి ఆశ్చర్యం కలగొచ్చు కానీ ఇది నిజం.

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Sat, 28 Jan 2012 18:12:01 -0800 స్త్రీ-పురుష సంబంధాల విషయంలోని ఈ మూఢనమ్మకాలు వ్యక్తివాదం నుంచి పుట్టలేదా? http://stalin-mao.net.in/96686923 http://stalin-mao.net.in/96686923 ఒక వ్యక్తి పిల్లలు పుట్టకుండా చనిపోతే కోర్ట్ అతని ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది కానీ అతని బంధువులు అతని ఆస్తిని పంచుకోవడానికి అవ్వదు. ఇప్పటి చట్టాలు వ్యక్తిగత ఆస్తికి అంత విలువ ఇస్తాయి.


పురుషాధిక్య సమాజంలో భర్త భార్యని వ్యక్తిగత ఆస్తిని చూసినట్టే చూస్తాడు. కానీ విచిత్రమేమిటంటే భర్త చనిపోయిన స్త్రీని కూడా భర్త యొక్క ఆస్తిని చూసినట్టు చూడడం. ఇప్పుడు కూడా భర్త చనిపోయిన స్త్రీకి రెండో పెళ్ళి సంబంధం దొరకడం కష్టమైన పనే. సమాజం ఎంత అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నా ఈ అభివృద్ధి నిరోధక నమ్మకాలు ఇంకా ఆచరించడం కనిపిస్తోంది.

భర్త చనిపోయిన స్త్రీని ఆమె అత్తవారి ఇంటివారు పుట్టింటికి పంపేస్తారు. ఆమెని పోషించడం తమకి సాధ్యం కాదని చెప్పి పుట్టింటికి పంపేస్తారు. భర్త చనిపోయిన స్త్రీని అత్తవారి ఇంటిలో ఉండనివ్వనప్పుడు ఆమె రెండో పెళ్ళి చేసుకుంటే అభ్యంతరం చెప్పకూడదు కదా. ఆమెని అత్తవారి ఇంటి వాళ్ళే పుట్టింటికి పంపేసిన తరువాత ఆమె ఎవరిని పెళ్ళి చేసుకున్నా సమాజానికి అభ్యంతరం ఉండకూడదు.

ఇంకో విచిత్రమేమిటంటే పక్కవాడు కష్టాలలో ఉన్నా మాట సహాయం కూడా చెయ్యకుండా నాకేమిటి అని లాభాలు లెక్కేసే వైయుక్తికవాదులు కూడా రెండో పెళ్ళి, మూడో పెళ్ళి లాంటి విషయాలలో అభ్యంతరాలు చెప్పడం. పక్కవాళ్ళ కష్టాల గురించి ఆలోచించడం అనవసరం అనుకునేవాళ్ళకి ఇతరుల వివాహ జీవితాలకి సంబంధించిన విషయాలలో తలదూర్చడం అవసరమని ఎందుకు అనిపిస్తోంది? పురుషాధిక్యత పదిలంగా ఉండాలంటే ఆడది ఆ స్థాయికి ఎదగకూడదనే అభివృద్ధి నిరోధక లోచనలోంచే సమాజాన్ని చూస్తున్నారు కదా. సమాజం అభివృద్ధి చెందకపోయినా ఫర్వా లేదు కానీ ఆధిక్యతా భావజాలంతో సంతృప్తిపడిపోదాం అని అనుకుంటున్నారు.
 

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Fri, 27 Jan 2012 22:55:00 -0800 స్త్రీలలో కూడా స్త్రీవాదాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఉంటారా? http://stalin-mao.net.in/96554052 http://stalin-mao.net.in/96554052

స్త్రీలలో కూడా స్త్రీవాదాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఉంటారా?

ఈ ప్రశ్న అడిగితే 'ఉంటారు, ఉన్నారు కూడా' అని సమాధానం చెప్పాల్సి వస్తుంది.

వందల కోట్లు ఆస్తి ఉన్న సినిమా నటుడు జితేంద్ర భార్య శోభా కపూర్ కొన్ని కోట్లకి కక్కుర్తి పడి ఒక స్త్రీ జీవితాన్ని చాలా చెత్తగా చూపించే సినిమా నిర్మించింది. ఒకవేళ మగ నిర్మాత ఆ అశ్లీల సినిమాని నిర్మించినా అందులో హీరోయిన్‌గా నటించేది స్త్రీయే కాబట్టి, ఆడదాని సహకారం లేకుండా ఆ సినిమా నిర్మాణం జరగదు కాబట్టి అందులో స్త్రీ తప్పు కూడా ఉందనే విషయాన్ని కాదనలేము.

వ్యాపారం కోసం పురుషాధిక్యతని ఉపయోగించుకుని అశ్లీల సినిమాలలో నటించే స్త్రీల సంగతి సరే, తమ తాత్కాలిక ప్రయోజనాల కోసం పురుషాధిక్యతని ఉపయోగించుకునేవాళ్ళ సంగతి ఏమిటి?

ఒకామె తల్లితండ్రులు రెండు లక్షలు కట్నం ఇచ్చి ఆమెకి పెళ్ళి చేశారు. ఆమె తోటి కోడలు పుట్టింటి నుంచి లక్ష రూపాయలే కట్నం తెచ్చింది. చిన్న కోడలు తెచ్చిన లక్ష రూపాయల కట్నం సరిపోలేదని అత్తమామలు ఆమెని వేధించారు. ఆమె అత్తమామలకి భర్త, బావ గారితో పాటు పెద్ద కోడలు కూడా సహకరించింది. అలా సహకరిస్తే పెద్ద కోడలికి ఏమొస్తుంది? ఆమె తల్లితండ్రులు కూడా రెండు లక్షలు కట్నం ఇచ్చి నష్టపోయారు కదా. ఆమె తల్లితండ్రులు రెండు లక్షలు కట్నం ఇవ్వగలిగే ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు కావచ్చు కానీ ఆమె తోటి కోడలి తల్లితండ్రులు అంత కట్నం ఇవ్వగలిగేంత ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు కాకపోవచ్చు కదా? ఈ విషయం పెద్ద కోడలికి తెలియదా? కట్నం ఇవ్వడం, తీసుకోవడం తప్పైనప్పుడు పెళ్ళి తరువాత కూడా అదనపు కట్నం అడగడం ఇంకెంత తప్పు కావాలి?

ఒకవేళ చిన్న కోడలి తల్లితండ్రులు అప్పులు చేసి అత్తవారికి అడిగిన కట్నం ఇచ్చినా ఆ డబ్బులు అత్తమామల చేతుల్లోనే ఉంటాయి కానీ తోటి కోడలి చేతిలోనో, బావగారి చేతిలోనో ఉండవు. ఇది బావగారికి కూడా అనవసరమైన విషయం అయినా తోటి కోడలు అదనపు కట్నం విషయంలో అత్తమామలకి ఎందుకు సహకరించింది? ఆమె ప్రయోజనం కాని ప్రయోజనం కోసం స్త్రీల హక్కులకి వ్యతిరేకమైన పని చేసింది. తాత్కాలిక ప్రయోజనాల కోసం పాడు పనులు చేసేవాళ్ళు ఉంటారు. ప్రయోజనం కాని ప్రయోజనం కోసం గడ్డి తినడమే ఇక్కడ విచిత్రం.

భర్త చనిపోయిన స్త్రీకి బలవంతంగా పసుపుకుంకుమలు తీసేసి విధవని చేసే అనాగరిక కార్యక్రమం దగ్గర ఉండి జరిపించేది ఆడవాళ్ళే. అలాంటి పనులు చేస్తే వాళ్ళకి ఎలాంటి పరోక్ష ప్రయోజనం కూడా కలగదు. వాళ్ళు కేవలం పురుషులని ప్రసన్నం చేసుకుని తాము ఉత్తమ పతివ్రతలమని అనిపించుకోవడానికి ఆ అనాగరిక కార్యం చేస్తారు.

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Fri, 27 Jan 2012 21:11:00 -0800 తెలంగాణా ప్రజలు బానిస శృంఖలాలని తెంచి స్పార్టెకస్‌లా రణరంగంలోకి దూకాలి http://stalin-mao.net.in/jump-in-to-fray http://stalin-mao.net.in/jump-in-to-fray

jai_telangana.mp4 Watch on Posterous

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Thu, 26 Jan 2012 20:46:57 -0800 వ్యక్తివాదం పుట్టినది ఆదిమ సమాజంలోనే కానీ ఆధునిక సమాజంలో కాదు - కొడవటిగంటి కుటుంబరావు http://stalin-mao.net.in/96402658 http://stalin-mao.net.in/96402658 వైయుక్తికవాదానికి ఆధునికత పేరు పెట్టి వైయుక్తికవాదం పేరుతో మార్క్సిజాన్ని విమర్శించడం కొంత మంది స్వయంప్రకటిత ఆధునికాంతరవాదుల స్టైల్. వైయుక్తికవాదంలో గానీ, ఆధునికాంతరవాదంలో గానీ కొత్తదనం ఏమీ లేదు. అవి పాత భావజాలానికి కొత్త పేర్లు. వైయుక్తికవాదం ప్రబలంగా ఉన్న సమాజంలో మనిషి ఇతరులని కంటే తనని తానే ఎక్కువగా నమ్ముతాడు. వైయుక్తికవాదాన్ని పూర్తిగా అధిగమించే స్థాయికి మన సమాజం ఇంకా ఎదగలేదు.

సమాజం అభివృద్ధి చెందని ఆటవిక దశలో మనిషి తనని తానే ఎక్కువగా నమ్ముకోవడం విచిత్రం కాదు. అప్పట్లో మనిషి తన తరువాత తన సమూహాన్ని ఎక్కువగా నమ్మేవాడు. ఒక సమూహం నుంచి తప్పిపోయిన మనిషి ఇంకో సమూహంలో చేరే అవకాశం ఉండేది కాదు. అప్పట్లో కొత్త సమూహం నుంచి వచ్చిన వ్యక్తిని నమ్మేవాళ్ళు కాదు. అతను పని చెయ్యగలడు అనిపిస్తే అతని చేత కొన్ని రోజులు పని చెయ్యించి చూసి ఆ తరువాత అతన్ని తమ సమూహంలో చేర్చుకోవాలా, వద్దా అనేది నిర్ణయించుకునేవాళ్ళు.

ఆటవిక దశలో కూడా మనుషులకి పరలోకం, పునర్జన్మ లాంటి ఊహలు ఉండేవి. పూర్వం ఒక మనిషి చనిపోతే అతని ఆయుధాలు, ఇతర పనిమట్లని అతని శవంతో పాటు పాతి పెట్టేవాళ్ళు. పరలోకంలో కూడా అతనితో పాటు అతని పనిమట్లు ఉండాలని భావించి అతని పనిమట్లని అతని శవం పక్కన పాతి పెట్టేవాళ్ళు. ఆ పనిమట్లన్నీ రాళ్ళు లేదా ఎముకలతో చేసిన పనిమట్లే. అయినా ఆ పనిమట్లు పరలోకంలో అతనికి తోడుగా ఉండాలని భావించి వాటిని అతని శవం పక్కన పాతిపెట్టేవాళ్ళు. అలాగే యజమాని శవం పక్కన బానిసలనీ, స్త్రీలనీ పాతిపెట్టిన సందర్భాలు కూడా ఉండేవి. అటువంటి సమాధులు ఈజిప్ట్‌లో బయటపడ్డాయి. యజమాని బానిసని తన సొంత ఆస్తిని చూసినట్టు చూడడాన్ని బట్టి అప్పట్లో వైయుక్తికవాదం ఎంత బలంగా ఉండేదో అర్థమైపోతుంది.

కొడవటిగంటి కుటుంబరావు గారు వ్రాసిన "వ్యక్తివాదానికి పుట్టిల్లు ఆటవిక సమాజం" అనే వ్యాసం చదివినప్పుడు ఈజిప్షియన్ సమాధులు గుర్తొచ్చాయి. వ్యక్తివాదం ఆధునికమైనదనే వాదనలో నిజం లేదని చెప్పడానికి కుటుంబరావు గారు ఆ వ్యాసం వ్రాసారు.

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Thu, 26 Jan 2012 04:34:27 -0800 ప్రకృతి ముందు సమానమే కానీ సమాజం ముందు సమానం కాదు http://stalin-mao.net.in/96286266 http://stalin-mao.net.in/96286266
Rich-and-poor

ధనవంతుని శరీర నిర్మాణానికీ, పేదవాని శరీర నిర్మాణానికీ మధ్య ఎలాంటి తేడా లేదు అని తెలిసిన డాక్టర్ కూడా ధనవంతుణ్ణి ఒకలాగ, పేదవాణ్ణి ఇంకోలాగ ఎందుకు చూస్తాడు? తాను చదివిన భౌతిక శాస్త్రమే అతనికి గుర్తుండదా? అతను చదివిన భౌతిక శాస్త్రం అతనికి గుర్తుంటుంది. కానీ ఆ శాస్త్రాన్ని సమాజానికి అప్లై చెయ్యడు. "ధనవంతుని శరీరంలో ఉన్న రక్తం ఎరుపే, పేదవాని శరీరంలోని రక్తం కూడా ఎరుపే. కనుక ధనవంతులు పేదవాళ్ళకి తక్కువ గౌరవం ఇవ్వకూడదు" అని సంస్కరణవాదులు వందలాది సంవత్సరాల నుంచి చెపుతున్నారు కానీ సమాన గౌరవం అనేది ఎందుకు రాలేదు? ఎందుకంటే ప్రకృతిలో మనుషులందరూ సమానమే కానీ సమాజంలో మనుషులందరూ సమానం కాదు.

సామ్రాజ్యవాది శరీరంలోని రక్తం ఎరుపే, మూడో ప్రపంచ దేశానికి చెందిన వ్యక్తి శరీరంలోని రక్తం కూడా ఎరుపే. భారతీయులని "ఇండియన్ డాంకీస్" అని అన్న బ్రిటిష్ క్రికెటర్ నాసర్ హుస్సేన్‌కి కూడా ఈ విషయం తెలుసు. నాసర్ హుస్సేన్ తండ్రి కూడా భారతీయుడే. భారత దేశం నుంచి వలస వెళ్ళి ఇంగ్లాండ్‌లో స్థిరపడడం వల్ల గాడిద రక్తం మనిషి రక్తంగా మారిపోతుందా? భారతీయులు గాడిదలు కాదు అని నాసర్ హుస్సేన్‌కి తెలుసు. ధనవంతులు పేదవాళ్ళని జంతువులని చూసినట్టు ఎలా చూస్తారో, సామ్రాజ్యవాదులు కూడా మూడో ప్రపంచ దేశాలవాళ్ళని అలాగే పశువులని చూసినట్టు చూస్తారు.

స్వేచ్ఛ గురించీ, సమానత్వం గురించీ, సహోదరత్వం గురించీ బూర్జువా సంస్కరణవాదులు ఎన్ని కబుర్లైనా చెపుతారు. కానీ వాస్తవంలో కనిపించేది వేరు. ఒక డబ్బున్నవాడు పేదవాని పక్కన కూర్చోవడం ఎక్కడా కనిపించదు. సామ్రాజ్యవాద దేశాలకి చెందినవాళ్ళు మూడో ప్రపంచ దేశాలకి చెందినవాళ్ళని కుక్కలు, గాడిదలని చూసినట్టు చూడడం బాహాటంగానే కనిపిస్తుంది. కేవలం ప్రాకృతిక సమానత్వం ఉంటే సరిపోదు. ఆర్థిక సమానత్వం ఉంటేనే సామాజిక సమానత్వం వస్తుంది.

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Wed, 25 Jan 2012 20:55:25 -0800 అన్నా హజారే ఉద్యమం ఎందుకు విఫలమయ్యింది? - ఒక సీరియస్ చర్చ http://stalin-mao.net.in/96221773 http://stalin-mao.net.in/96221773 మన దేశం ఆర్థికంగా ఎందుకు వెనుకబడింది అని అడిగితే ఒక స్టీరియోటిపికల్ ఆలోచనాపరుడు ఇలా సమాధానం చెపుతాడు "స్వార్థ రాజకీయాలు, అవినీతి కారణం" అని. అవినీతి అంటే ఏమిటి? చట్ట వ్యతిరేకంగా చేసేది మాత్రమే అవినీతా? మార్కెట్‌లో రూపాయి పెట్టుబడి పెట్టి రెండు రూపాయలు సంపాదించు అనేది అవినీతి కిందకి రాదా? ఈ ప్రశ్నకి అతను సమాధానం చెప్పలేడు.

అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడాడు కానీ ఆర్థిక అసమానతల గురించి ఎందుకు మాట్లాడలేదు అని మార్క్సిస్ట్‌లు అడిగితే "అవినీతికీ, ఆర్థిక అసమానతలకీ సంబంధం ఏమిటి? ఆర్థిక అసమానతల గురించి మాట్లాడనివాడు అవినీతి గురించి మాట్లాడకూడదా?" అని అన్నా హజారే అభిమానులు ప్రశ్నలు అడిగారు. అవినీతి పెద్ద సమస్యా, లేదా ఆర్థిక అసమానతలు పెద్ద సమస్యా? అని మనం అడిగామనుకోండి, అన్నా హజారే అభిమానులు ఇలా సమాధానం చెపుతారు "అవినీతిపరులు మనం టాక్స్‌లుగా కట్టిన డబ్బులనే భోంచేస్తున్నారు కనుక అవినీతిని వ్యతిరేకించాల్సిందే" అని. పేదవాళ్ళు ఎలాగూ టాక్స్‌లు కట్టరు కనుక ఈ సమాధానం చెపితే పేదవాళ్ళు అవినీతిని వ్యతిరేకిస్తారా? నిత్య జీవితంలో ఏవో సమస్యలతో ఉండే పేదవాళ్ళు తాము కట్టని టాక్స్ డబ్బుల కోసం అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటారా?

అవినీతిని వ్యతిరేకించాలంటే సామాజిక బాధ్యత ఉండాలి. కేవలం మా టాక్స్ డబ్బులు భోంచేస్తున్నారు కనుక మేము అవినీతిని వ్యతిరేకిస్తున్నాము అనడం సామాజిక బాధ్యత అవుతుందా లేదా స్వార్థం అవుతుందా? నాకు IDBIలో అకౌంట్ ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అకౌంట్ లేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఫ్రాడ్ జరిగితే నాకు రూపాయి నష్టం కూడా రాదు. అలాగని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఫ్రాడ్ జరిగితే నాకేమిటి సంబంధం అని అనుకోవాలా? సామాజిక బాధ్యత గురించి మాట్లాడకుండా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అన్నా హజారే కూడా ఎన్నడూ సామాజిక బాధ్యత గురించి మాట్లాడలేదు. అందుకే అతని అనుచరులలో సామాజిక బాధ్యత తెలియనివాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు.

స్వార్థపరుడు సమాజం గురించే కాదు, తన చుట్టూ ఉన్న మనుషుల గురించి కూడా ఆలోచించడు. ఒక స్వార్థపరుడు ఓ బ్యాంక్‌లో ఇరవై వేలు ఫిక్సెడ్ డిపాజిట్ వేశాడనుకుందాం. అదే బ్యాంక్‌లో ఫ్రాడ్ జరిగిందనుకుందాం. ఫ్రాడ్ చేసిన వ్యక్తిని ఉద్యోగం నుంచి పీకేశారు. ఫ్రాడ్ జరగకముందే జాగ్రత్త తీసుకోలేదని మరి కొంత మంది ఉద్యోగులని కూడా ఉద్యోగం నుంచి పీకేశారు. ఈ విషయం ఇరవై వేలు ఫిక్సెడ్ డిపాజిట్ చేసిన స్వార్థపరునికి తెలిసిందనుకుందాం. అతను కేవలం "బ్యాంక్‌వాళ్ళు తన డబ్బులు తనకి తిరిగి ఇవ్వగలరా, లేదా?" అనే విషయమే ఆలోచిస్తాడు కానీ ఫ్రాడ్ వల్ల కొంత మంది ఉద్యోగాలు పోయినందుకు అతను బాధపడడు. బ్యాంక్‌వాళ్ళు అతని డబ్బులు అతనికి తిరిగి ఇస్తారని అనిపిస్తే ఫ్రాడ్ జరిగిన విషయం కూడా ఆ వ్యక్తి మర్చిపోతాడు. ఎందుకంటే స్వార్థం అనేది అతని చుట్టు జరిగిన వాటి గురించి కూడా అతన్ని ఆలోచించనివ్వదు. తన చుట్టూ జరిగేవాటి గురించే ఆలోచించనివాడు దేశంలో జరుగుతోన్న అవినీతి గురించి ఎక్కడ ఆలోచిస్తాడు?

అన్నా హజారే ఆర్థిక విధానాల గురించి ఎందుకు మాట్లాడలేదు అని మనం అడిగితే "ఆర్థిక విధానాలకీ, అవినీతికీ సంబంధం ఏమిటి?" అని అన్నా హజారే అభిమానులు అడుగుతారు. ఆర్థిక విధానాలకీ, అవినీతికీ మధ్య సంబంధం ఉంది.దోచుకునేవాడు కేవలం చట్టం అనుమతించిన పద్దతులలోనే దోచుకోవాలనుకోడు. మన దేశంలో ఫాక్టరీలలో కార్మికుల చేత ఎనిమిది గంటలకి పైగా పనులు చెయ్యించుకోవడం చట్ట వ్యతిరేకం కాదు, కార్మికులకి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వకపోవడం కూడా చట్ట వ్యతిరేకం కాదు, దేశంలోని ఖనిజ సంపదని బహుళజాతి కంపెనీలకి అమ్మెయ్యడం కూడా చట్ట వ్యతిరేకం కాదు, దేశంలోని వ్యవసాయ భూములకి బహుళజాతి కంపెనీలకి కట్టబెట్టడం కూడా చట్ట వ్యతిరేకం కాదు. అయితే దోచుకునేవాళ్ళు కేవలం ఈ చట్టపరమైన అవకాశాలని ఉపయోగించుకుని మాత్రమే దోచుకుంటారనుకోవాలా? వాళ్ళు మంత్రులకి లంచాలు ఇచ్చి ప్రోజెక్ట్‌లు తమకి దక్కించుకోవడం లాంటివి చెయ్యరని అనుకోవాలా? ఏ దేశంలోనైనా పాలక వర్గ పార్టీలు మార్కెట్ పెట్టుబడిదారులు ఇచ్చిన విరాళాలతోనే పని చేస్తాయి. అటువంటప్పుడు పాలక వర్గ పార్టీలు మార్కెట్ పెట్టుబడిదారులకి నష్టం కలిగించే చట్టాలు ఎలా తయారు చేస్తాయి?

2G కుంభకోణం మన్మోహన్ సింగ్‌కి తెలిసే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అంత పెద్ద కుంభకోణం ప్రధాన మంత్రికి తెలియకుండా చెయ్యడం సాధ్యం కాదు కూడా. స్వయంగా అవినీతిపరుడైన మన్మోహన్ సింగ్ లోక్‌పాల్ చట్టం తయారు చేస్తాడని అన్నా హజారే ఎలా అనుకున్నట్టు? లోక్‌పాల్ చట్టం తయారు చేస్తే మన్మోహన్ సింగ్ ఏయే కంపెనీలతో కాంట్రాక్ట్‌లు కుదుర్చుకున్నాడు అనే విషయాలు కూడా బయటపడతాయి. ఏ పాలకవర్గంవాడైనా తనకు తానుగానే కొల్లేటిలోకి దిగుతాడా? లోక్‌పాల్ బిల్ అమలులోకి రాకుండా మన్మోహన్ సింగ్ తన జాగ్రత్తలు తాను తీసుకుంటాడని తెలిసే అన్నా హజారే ఈ ఉద్యమం నడిపాడు. అందుకే అన్నా హజారే నడిపిన లోక్‌పాల్ ఉద్యమం విఫలమయ్యింది.

లోక్‌పాల్ చట్టం తేవడం సాధ్యం కాదని తెలిసినా కొంత మంది అన్నా హజారేకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలని పక్కాగా అమలు చెయ్యడంలో విఫలమయ్యిందనే అసంతృప్తి కొంత మంది ఉన్నత వర్గంవాళ్ళలో ఉంది. కాంగ్రెస్ కూడా సరళీకృత ఆర్థిక విధానాలని నమ్ముకునే పార్టీయే కానీ బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే ఆ పార్టీ సరళీకృత ఆర్థిక విధానాలని పక్కాగా అమలు చేస్తుందని భావించి కొందరు కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టడానికి అన్నా హజారేకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్‌ని వ్యతిరేకించే RSS కూడా అన్నా హజారేకి మద్దతుగా కార్యకర్తలని సప్లై చేసింది. కాంగ్రెస్‌ని వ్యతిరేకించే పార్టీలు అతనికి కార్యకర్తలని సప్లై చేసినా హజారే తన ఉద్యమాన్ని సమర్థవంతంగా నడపలేకపోయాడు. అయినా అన్నా హజారేని హీరోగా పొగిడే పత్రికలూ, టివి చానెళ్ళూ ఉన్నాయి.

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Tue, 24 Jan 2012 21:42:00 -0800 కులవాదం, లింగవాదం, వర్గవాదం, వైయుక్తికవాదం - ఇందులో ఏది సత్యం? http://stalin-mao.net.in/96020181 http://stalin-mao.net.in/96020181

ఆర్యన్ ఇన్వేజన్ థియరీ గురించి మనం ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాళ్ళతో చర్చించడానికి ప్రయత్నించామనుకోండి, వాళ్ళు ఆ చర్చకి ఒప్పుకోరు. వాళ్ళు ఆ చర్చని దాటవెయ్యడానికి ప్రయత్నించి "ఆర్య-ద్రవిడ సిద్ధాంతం తప్పని ఎప్పుడో తేలిపోయింది" అని వాదిస్తారు. నిజానికి ఆర్యన్ ఇన్వేజన్ థియరీ నూరు శాతం నిజమే. కానీ కేవలం DNA పరీక్షల ఆధారంగా ఒక వ్యక్తిది ఏ కులమో చెప్పడం సాధ్యం కాదు అనే ఒకే పాయిట్ చెప్పి ఆర్య-ద్రవిడ సిద్ధాంతం తప్పు అని వాదించేవాళ్ళు ఉన్నారు.

ఏ కాలంలోనైనా కులాంతర వివాహాలు చేసుకునేవాళ్ళు కొంత మందైనా ఉంటారు. ఒక కులానికి చెందిన వ్యక్తికి ఇంకో కులానికి చెందిన వ్యక్తితో దూరపు రక్త సంబంధం ఉండడం ఏ కాలంలోనైనా సంభవమే. కనుక DNA పరీక్షల ద్వారా కులాన్ని నిర్ణీతంగా చెప్పడం సాధ్యం కాని పని. అంత మాత్రాన ఆర్య-ద్రవిడ సిద్ధాంతం తప్పని అనుకోలేము. అగ్రకులాలవాళ్ళలో ఎక్కువ మంది ఇప్పటికీ తెల్లని వర్ణంలోనే కనిపిస్తున్నారు, దళితులలో ఇప్పటికీ ఎక్కువ మంది నల్లని వర్ణంలోనే కనిపిస్తున్నారు. అగ్రకులాలవాళ్ళు ఆవు మాంసం ముట్టుకోరు. దళితులు & గిరిజనులు ఇప్పటికీ ఆవు మాంసం, పోతు మాంసం తింటారు. సంస్కృతి, ఆచారాలలో కూడా అగ్రకులాలవాళ్ళకీ, దళితులకీ మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

ఆర్యన్ ఇన్వేజన్ థియరీ తప్పనీ, అన్ని కులాలూ సమానమేననీ వాదించేవాళ్ళు వ్యక్తిగతంగా కులాంతర వివాహాలు చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? కులాన్ని స్టేటస్ సింబల్‌గా భావించేవాళ్ళు కులాంతర వివాహాలకి సాధారణంగా ఒప్పుకోరు. అయితే కాలేజ్‌లోనో, ఆఫీస్‌లోనో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడినవాళ్ళు ఆ అమ్మాయిది ఏ కులమో తెలియకపోతే, కులం పేరు తెలిసినంతమాత్రాన ప్రేమని త్యజించలేము అనిపిస్తే, అప్పుడు కులంతో సంబంధం లేకుండా పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది. పూర్వం ఒక ప్రాంతంవాళ్ళు ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు అక్కడ తమ జాతికి చెందినవాళ్ళు దొరక్కపోతే జాత్యాంతర వివాహాలే చేసుకునేవాళ్ళు. తమ ప్రాంతంలో తమ కులానికి చెందినవాళ్ళ జనాభా పైకి కనిపించేంత సంఖ్యలో ఉంటే వేరే కులంలో పెళ్ళి సంబంధాలు చూడడానికి ఒప్పుకుంటారా? అన్ని కులాలూ సమానమేనని వాదించే ఆర్యన్ ఇన్వేజన్ థియరీ వ్యతిరేకులు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి.

ఎంత కుల సమాజంలోనైనా కులాంతర వివాహాలు చేసుకునేవాళ్ళు కొందరైనా ఉంటారు. కులం కూడా మతంలాగే భావవాద పునాదుల మీద నిర్మించబడినది. కులం కూడా మతంలాగే మనిషిని పెద్దగా ప్రభావితం చెయ్యలేని విషయం. అందుకే కుల సంఘం నాయకులు తమ కులానికి చెందిన పేదవాళ్ళ దగ్గరకి వెళ్ళకుండా తమ కులానికి చెందిన డబ్బున్నవాళ్ళ చుట్టే తిరుగుతారు. మతం గురించి పట్టించుకోకుండా పెళ్ళి చేసుకునేవాళ్ళు ఉన్నట్టే కులం గురించి పట్టించుకోకుండా పెళ్ళి చేసుకునేవాళ్ళు కొంత మందైనా ఎల్లప్పుడూ ఉంటారు. భావవాదంలో నిబంధనకీ, ఆచరణకీ మధ్య వైరుధ్యం సహజం.

లింగవాదంలో కూడా లింగవాదులు రూపొందించిన నియమాల ప్రకారం పని చెయ్యడం అన్ని సమయాలలోనూ సాధ్యం కాదు. పూర్వం భర్త చనిపోయిన స్త్రీకి గుండు గియ్యించి తెల్ల చీర కట్టే ఆటవిక ఆచారం ఉండేది. పది మంది వచ్చిపోయే ఆఫీస్‌లో ఉద్యోగం చేసే స్త్రీ తెల్ల చీర కట్టుకుని ఆఫీస్‌కి వెళ్ళడం ఏ రకంగానూ జరగని పని. పట్టణ ప్రాంతాలలో ఈ ఆటవిక ఆచారాలని ఆచరించడం టెక్నికల్‌గా సాధ్యం కాదు. ఒక అబ్బాయి తన ఆఫీస్‌లో పని చేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి భర్త చనిపోయాడని తెలిసింది. ఆమె భర్త చనిపోయిన స్త్రీ అయినా సరే ప్రేమని కొనసాగించాలి, ఆమెని పెళ్ళి చేసుకోవాలి. ఆమె గత జీవితం గురించి తెలిసిందని ప్రేమని త్యజిస్తే దాన్ని ఎవరూ ప్రేమ అనరు, అది కేవలం సెక్స్ వాంఛ అవుతుంది, సెక్స్ వాంఛకి ప్రేమ అని పేరు పెట్టుకోవడం అవుతుంది. కనుక నిజమైన ప్రేమికుడు తన ప్రియురాలు భర్త చనిపోయిన స్త్రీ అని తెలిసినా ఆమె గత జీవితం గురించి ఆలోచించకుండా పెళ్ళి చేసుకుంటాడు.

లింగవాదానికి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైల్వేలలో స్త్రీకి TTE ఉద్యోగం ఇస్తారు కానీ లోకో డ్రైవర్ ఉద్యోగం ఇవ్వరు. TTE ఉద్యోగం చెయ్యగలిగేవాళ్ళు లోకో డ్రైవర్ ఉద్యోగం మాత్రం చెయ్యలేరా? ఆడవాళ్ళు లోకో డ్రైవర్లు అయితే ట్రైన్ యాక్సిడెంట్‌లు జరుగుతాయా? పురుషవాదులకి స్త్రీవాదులు ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. కానీ పురుషవాదులు ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేరు. సమాధానాలు చెప్పలేకపోయినా తమలో తప్పు ఉందని పురుషవాదులు ఒప్పుకోరు. నాన్‌సెన్స్ మాట్లాడాలనుకునేవాళ్ళు ఎంతైనా మాట్లాడగలరు. వాళ్ళు తమ వాదనని జస్టిఫై చేసుకోవడానికి లాజికల్ సమాధానాలు చెపుతారని అనుకోలేము.

వర్గవాదం విషయానికి వద్దాం. వైట్ కాలర్ వర్గంవాళ్ళలో ఎక్కువ మంది కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తారు అనేది అందరికీ తెలిసినదే. నిరుద్యోగిగా ఉన్నప్పుడు నక్సలైట్లని సమర్థించినవాడు DSP ఉద్యోగం దొరికిన తరువాత పాలక వర్గానికి నమ్మిన బంటుగా మారిపోడని చెప్పలేము. వర్గం మారితే వైరుధ్యం మారుతుందనేది మార్క్సిస్ట్‌లందరికీ తెలిసిన విషయమే. అయితే పాలక వర్గంవాళ్ళు నక్సలైట్లని అణచివెయ్యడానికి విడుదల చేసిన నిధులని తమ సొంత ప్రయోజనాలకి దుర్వినియోగం చేసిన పోలీస్ అధికారులు ఉన్నారు. కార్మిక వర్గ పార్టీ అధికారంలోకి వస్తే తాము ఆ పార్టీ చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుందని ఈ వైట్ కాలర్ ఖాకీ అధికారులకి తెలియదా? కార్మిక వర్గ పార్టీ అధికారంలోకి వస్తుందో, రాదో ఆ అధికారులకి తెలియదు కానీ ఆ పార్టీని అణచివెయ్యడానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని తమ సొంత ఖాతాలో వేసుకుని వ్యక్తిగత లాభం పొందుదామని అనుకుంటారు. ఈ వైట్ కాలర్ ఖాకీ అధికారులలో వర్గవాదం ఉందా, లేదా? వీళ్ళలో వర్గవాదం ఉంది కానీ వ్యక్తిగత ప్రయోజనాల గురించే ఎక్కువగా ఆలోచించే స్వార్థపరులు ఎల్లప్పుడూ వర్గ నియమాలకే కట్టుబడి ఉంటారా? అలా ఉండరు.

సోషలిస్ట్ విప్లవం వస్తే ఇనిషియల్ స్టేజ్‌లో పరిశ్రమలనీ, వ్యవసాయ క్షేత్రాలనీ జాతీయం చెయ్యడం జరుగుతుంది, ఆ తరువాతి క్రమంలో ప్రైవేట్ ఆస్తిని పూర్తిగా రద్దు చెయ్యడం జరుగుతుంది. వైట్ కాలర్ ఖాకీ అధికారులకి ఈ విషయాలు తెలిసినా ఎప్పుడో రద్దుకాబడే ప్రైవేట్ ఆస్తి కోసం మన తాత్కాలిక ప్రయోజనాలని వదులుకోవడం ఎందుకు అని అనుకుంటారు.

వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానం అనుకునేవాళ్ళకి ఆ ప్రయోజనాల ముందు వర్గ సంబంధాలు లెక్కలోకి రావు. వైట్ కాలర్ వర్గంలోనే కాదు, సాధారణ ప్రజలలో కూడా తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశపడేవాళ్ళు ఉంటారు. అందుకే పాలక వర్గంవాళ్ళు ఫ్రీ స్కీమ్‌లు లాంటివి పెట్టి జనం విప్లవం గురించి ఆలోచించకుండా చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఉచిత విద్యుత్, రాజీవ్ యువశక్తి లాంటివి ఆ రకం ఫ్రీ స్కీమ్‌లే. ప్రజలని చైతన్యవంతం చెయ్యడానికి ప్రయత్నించే మార్క్సిస్ట్‌లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే విప్లవం రాకుండాపోతుంది.

1970ల టైమ్‌లో విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని బలిజిపేట ప్రాంతంలో చాలా మంది గ్రామీణ పేదలు నక్సలైట్ ఉద్యమంలో చేరారు. నక్సలైట్లు తమకి లొంగిపోతే ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనని గుడ్డిగా నమ్మేసి చాలా మంది నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగిపోయారు. కానీ ప్రభుత్వానికి లొంగిపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి లాభం కలగలేదు. తొక్కడానికి రిక్షాలు మాత్రమే వచ్చాయి. ఏదో దొరుకుతుందని ఆశపడి రిక్షా కార్మికులుగా మారారు. తమ అధికారం పోకూడదనే నక్సలైట్లని లొంగిపొమ్మని చెప్పే పాలక వర్గంవాళ్ళు తమని నమ్మి లొంగిపోయినవాళ్ళకి నిజంగా లాభం కలిగిస్తారా? స్వార్థపరుడు ఎవడైనా తనని విశ్వసించిన వ్యక్తికి అదే విశ్వాసం రెసిప్రోకల్‌గా ఇస్తాడా? తమని నమ్మి లొంగిపోయిన మాజీ నక్సలైట్లకి ఈ స్వార్థ నాయకులు నడిపే ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుంది?

పేదవాళ్ళలో కూడా వర్గ చైతన్యం లేని వైయుక్తికవాదులు ఉంటారు. కానీ వైయుక్తికవాదం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలగదు. డబ్బున్నవాడు సమాజం గురించి ఆలోచించకపోయినా అతని భోగ విలాసాలు అతనికి ఉంటాయి. కానీ సాధారణ ప్రజల జీవితాలు మారాలంటే సామాజిక విప్లవాలు రావలసిందే.

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Mon, 23 Jan 2012 19:00:00 -0800 ఇంత సులభంగా కుల రాజకీయాలు నడిపేవాళ్ళకి వోట్లు వేస్తారా? అక్కడే జ్ఞానం ఎందుకు లోపిస్తుంది? http://stalin-mao.net.in/mheeuirtxryb http://stalin-mao.net.in/mheeuirtxryb

పూర్వం మన దేశంలో ఒక ఆటవిక ఆచారం ఉండేది. ఒక చండాల జాతివాడు దారిలో నడుస్తున్నప్పుడు చెక్క వాయించుకుంటూ నడవాలి. అగ్రకులాలవాళ్ళు ఎదురొచ్చినప్పుడు వాళ్ళు చెక్క శబ్దం విని, అతను చండాలుడని గుర్తించి పక్కకి తప్పుకుంటారు. చండాలుడు చెక్క వాయించకుండా తిరిగాడనుకోండి, తరువాత అతను చండాలుడని తెలిస్తే అతనికి కాల్చిన ఇనుముతో వాతలు పెట్టే శిక్షలే పడేవి.

రంగనాయకమ్మ గారు వ్రాసిన "దళిత సమస్య పరిష్కారానికి" పుస్తకం చదువుతున్నప్పుడు నా పక్కనే ఒక అగ్రకులానికి చెందిన అమ్మాయి కూర్చుని ఉంది. నేను ఎవరికీ కులం పేరు అడగను కానీ ఆ అమ్మాయి కులం పేరు ఎవరో చెపితే నాకు తెలిసింది. ఆ అమ్మాయికి ఒక ప్రశ్న అడిగాను "మీరు రోడ్ మీద బస్ కోసం నిలబడి ఉన్నారు, మీ పక్కనే రెల్లి కులస్తుడు నిలబడి ఉన్నాడు, అతను రెల్లి కులస్తుడు అని తెలిస్తే మీరు పక్కకి తప్పుకుంటారా?" అని. అప్పుడు ఆ అమ్మాయి ఇలా సమాధానం చెప్పింది "ఒక వ్యక్తి కులం పేరు చెప్పుకుంటేనే తెలుస్తుంది కానీ చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది? దళితుడు పక్కన నిలబడినంతమాత్రాన పక్కకి తప్పుకోవడం ఎలా జరుగుతుంది?" అని. నేను ఇలా అన్నాను "నా షాప్‌కి ఎడమ వైపే రెల్లి వీధి ఉంది. మీరు నా షాప్‌కి వచ్చేటప్పుడు మీ పక్కన నడుచుకుంటూ వెళ్ళేవాడు రెల్లి కులస్తుడు కూడా కావచ్చు కదా." అని. అప్పుడు ఆమె ఇలా సమాధానం చెప్పింది "ఎంత రెల్లి వీధి నుంచి వచ్చినా అతను ఆ వీధి నుంచి వచ్చాను అని చెప్పుకుంటేనే కదా అతను రెల్లి కులస్తుడని తెలుస్తుంది, అతను పక్కన నడిచినంతమాత్రాన పక్కకి తప్పుకోవడం ఎలా సాధ్యం?" అని.

నాలుగైదు కులాలవాళ్ళు ఉండే చోట ఒకడు కులం పేరు చెప్పుకుంటే గానీ ఇతరలకి అది తెలియదు. మరి రాజకీయ నాయకుల కులాల పేర్లు చిన్న పిల్లలకి కూడా ఎలా తెలుస్తున్నాయి? పత్రికలు "కులం" అనే పదం వ్రాయకుండా "సామాజిక వర్గం" అనే పదం వ్రాస్తున్నది కులవ్యవస్థని గ్లోరిఫై చెయ్యడానికే.  అది కులానికి ఏ రకంగానూ పరోక్ష సూచిక కాదనీ, ప్రత్యక్ష సూచిక మాత్రమే అనీ అందరికీ తెలిసినదే. అలాంటప్పుడు "సామాజిక వర్గం" అని కొత్త పదాలు కనిపెట్టి నాటకాలు ఆడడం ఎందుకు?

ముక్కూముఖం తెలియని వ్యక్తికి కులం పేరు అడగడానికి ఎవరికైనా మొహమాటం ఉంటుంది. పత్రికల స్టైల్‌లో "మీది ఏ సామాజిక వర్గం" అని అడిగే ధైర్యం కూడా ఉండదు. రాజకీయాల విషయానికొచ్చినప్పుడే సిగ్గూ, మొహమాటం అనేవి లేకుండా కులాన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నట్టు? వాళ్ళు "కులం" అనే పాత పేరు చెప్పకుండా "సామాజిక వర్గం" అనే కొత్త పేరు చెప్పినా వాళ్ళు నడిపేవి "కుల రాజకీయాలే" అని అందరికీ సులభంగా తెలిసిపోతుంది. అందరికీ సులభంగా తెలిసిపోతున్నప్పుడు పేర్లు మార్చి నాటకాలు ఆడడం అవసరమా?

ఒక టివి చానెల్‌లో ఏదో విషయమై చర్చ జరిగింది. మధ్యలో కుల రాజకీయాల ప్రస్తావన వచ్చింది. ఒకామె ఇలా అడిగింది "ఈ రోజుల్లో కుల రాజకీయాలు అవసరమా? సామాజిక వర్గం అనే పేరు పెట్టి కులాన్ని గ్లోరిఫై చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాము, అలాంటివి ఈ ఆధునిక కాలంలో అవసరమా?" అంటూ. ఆమె దాని గురించి అడుగుతూ ఉండగానే ఇతర వక్తలు సమాధానం చెప్పకుండా విషయం దాటవెయ్యడానికి ప్రయత్నించారు. ఎంత "సామాజిక వర్గం" అనే కొత్త పేరు పెట్టినా అది "కులం" అనే పాత సంప్రదాయాన్నే సూచిస్తుంది కానీ అందులో కొత్తదనం ఏమీ ఉండదు. దానికి సమాధానం చెప్పలేము అని ముందే ఊహించి ఇతర కులగజ్జి వక్తలు ప్రశ్న పూర్తవ్వకముందే దాటవెయ్యడానికి ప్రయత్నించారు.

కులం  అనేది నిజ జీవితంలో చాలా సందర్భాలలో అసంగత వ్యవహారమే. కానీ రాజకీయాలలోనే దాని యొక్క సాంగత్యం (relevance) ఎందుకు ఏర్పడుతుంది? నిజ జీవితానికి అవసరమైన ఇంకిత జ్ఞానం రాజకీయాలకి అవసరం లేదా? రాజకీయాల రంగం అనేది వ్యక్తిగత గొప్పలు (individual prestige) లేదా కుల గొప్పలు (caste prestige) ప్రదర్శించుకునే రంగమా? కుల రాజకీయాలు నడిపేవాళ్ళకి ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పే బాధ్యత లేదా?


Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma
Mon, 23 Jan 2012 00:01:00 -0800 మన పాలకులు తిరుపతికీ, శ్రీశైలానికీ వందలాది ప్రత్యేక బస్సులు నడుపుతున్నది ఇందుకే http://stalin-mao.net.in/95627460 http://stalin-mao.net.in/95627460

నిన్న టివిలో కంచ ఐలయ్య హిందూ మతాన్ని విమర్శిస్తూ వ్రాసిన ఒక పుస్తకంపై చర్చ జరిగింది. పల్లెటూర్లలో చదువురాని దళితుడు మంత్రాలు చదివి చేతబడి చేశాడంటే నమ్ముతారు కానీ బాగా చదువుకున్న అగ్రకులంవాడు చేతబడి చేశాడంటే ఎవరూ నమ్మరు అని ఒక వక్త అన్నాడు. కంచ ఐలయ్య కూడా ఇదే మాట అన్నాడు. వాళ్ళు చెప్పినది నిజమే కానీ అది విన్న తరువాత నేను నవ్వు ఆపుకోలేక చచ్చాను. ప్రభుత్వం ఒక వైపు ప్రజలని మూఢ నమ్మకాలని నమ్మొద్దు అని చెపుతోంది. కానీ అదే ప్రభుత్వం తిరుపతికీ, శ్రీశైలానికీ వందలాది ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మూఢ నమ్మకాలంటే కేవలం దెయ్యాలు, చేతబడులు మాత్రమేనా? దేవుళ్ళనీ, బాబాలనీ నమ్మడం మాత్రం మూఢ నమ్మకం కాదా అనే సందేహం వస్తోంది. కావాలని మూఢ నమ్మకాలని పోషించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమిటి? అని అడుగుతారు. ఇక్కడే అసలు విషయానికి సమాధానం దొరుకుతుంది.

1978 నుంచి మన పాలకులు ప్రతి గ్రామానికీ బస్సు నడుపుతామని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ విశాఖపట్నం, ఆదిలాబాద్ జిల్లాలలో ఇప్పటికీ వెయ్యికి పైగా గ్రామాలకి బస్సులు లేవు. కానీ తిరుపతికీ, శ్రీశైలానికీ నిత్యం కొత్త బస్సులు వస్తున్నాయి. పల్లె ప్రాంతాలలో అంత ట్రాఫిక్ ఉండదు అని కొందరు సమాధానం చెప్పొచ్చు కానీ మేము పల్లెటూరులో ఉండే రోజుల్లో రాజోలు నుంచి అమలాపురం వెళ్ళే బస్సులు నిత్యం రద్దీగానే వెళ్ళేవి. RTC వాళ్ళకి బస్సుల సంఖ్య పెంచమన్నా పెంచలేదు. అవసరమైన చోట బస్సుల సంఖ్య పెంచనివాళ్ళు తిరుపతికీ, శ్రీశైలానికీ మాత్రమే బస్సుల సంఖ్య ఎందుకు పెంచుతున్నట్టు? దేవుణ్ణి ఎంత బలంగా నమ్మేవాడైనా నిత్యం అదే నమ్మకాన్ని పట్టుకుని వేలాడడు, అంత కంటే తన భౌతిక అవసరాల గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. అయినా మన పాలకులు వ్యక్తిగత నమ్మకాలకే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు? TTD చేత ప్రత్యేక భక్తి చానెల్ కూడా ఎందుకు పెట్టించినట్టు? కేవలం వ్యక్తిగత విశ్వాసాల వల్ల సమాజం అభివృద్ధి చెందుతుందా? చెందదు, కానీ మన పాలకులు వ్యక్తిగత నమ్మకాలని ఎందుకు అంతలా ప్రోత్సహిస్తున్నట్టు?

పాలక వర్గంవాళ్ళు తమ సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తారు కానీ ప్రజల అవసరాలు తీర్చరు. తాము భౌతిక అవసరమైన డబ్బుని నమ్ముకుంటారు కానీ ప్రజలని మాత్రం ఊహాజనితమైన దేవుణ్ణీ, స్వర్గనరకాలనీ నమ్మమంటారు. ఆ నమ్మకాలని ప్రజలలో పెంపొందించడానికే తిరుపతికీ, శ్రీశైలానికీ ప్రత్యేక బస్సులు నడుపుతారు. ప్రజల భౌతిక అవసరాలు తీర్చకపోతే ఎందుకు తీర్చలేదు అని ప్రజలు పాలకులని అడుగుతారు. ప్రజలు పాలకులని అలా అడగకూడదంటే కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో వాళ్ళ మనసులని దారిమళ్ళించాలి. మన పాలక వర్గంవాళ్ళు చేస్తున్నది ఇదే. ఒక నియోజక వర్గంలో మెజారిటీ అయిన రెండుమూడు కులాలవాళ్ళని సంతృప్తి పరచడంలో అన్ని పాలకవర్గ పార్టీల అభిప్రాయాలూ ఒకేలాగ ఉంటాయి. కానీ ప్రజల భౌతిక అవసరాలు తీర్చే విషయంలో ఏ రెండు పాలక వర్గ పార్టీల అభిప్రాయాలూ ఒకేలాగ ఉండవు. ప్రజల మనసులని కులం, మతం లాంటి ఊహాజనితమైన విషయాల వైపు దారిమళ్ళించడం ఏ రకంగానూ ప్రజాస్వామ్యం కాదు.

 

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/844823/kondaveeti_praveen_sarma.png http://posterous.com/users/YwRljHO1s2Z Praveen Sarma hegelian2009 Praveen Sarma